డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని ఐపోలవరం మండలం జీ వేమవరం గ్రామంలోనీ పాఠశాలలో బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్, కౌమార గర్బాలు, బాల్యవివాహాలు, రక్షణ చట్టాలు,లింగ ఆధారిత హింస మరియు పునరుత్పత్తి ఆరోగ్యం అంశాలపై వకృత్వ పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు,సామాజిక అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థిని విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. అనంతరం వకృతి పోటీలు మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించి,విజేతలకు బహుమతులు అందజేశారు.

విద్యార్థి దశ నుండే సామాజిక అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలి