ఆగస్టు 22న భగత్‌సింగ్ భవన్లో జరిగే ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలు, యూత్ డిక్లరేషన్ హామీల అమలు కోసం మహాసభల్లో భవిష్యత్ పోరాటాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. యువత అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్య అతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి లింగం రవి హాజరుకానున్నారు.

ఏఐవైఎఫ్ తాండూర్ మండల 3వ మహాసభలను జయప్రదం చేయండి