Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఫార్మసీ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఫార్మసీ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు

రామచంద్రాపురం ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి

వెంకట్రామాపురం సమీపంలోని సెవెన్ హిల్స్ ఫార్మసీ
కళాశాలలో గురువారం నాడు కళాశాల ట్రైనింగ్ 2 ప్లేస్మెంట్ సెల్ మరియు IOAC ఆధ్వర్యంలో “క్యాంపస్ నుంచి కార్పొరేట్ ” అనే అంశం పై కెరీర్ గైడ్లైన్స్ సెషన్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విజన్ టెక్ గ్రూప్ వ్యవస్థాపకులు వినయ్ తేజ మరియు అంజన్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్ తేజ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే మెరుగైన కేరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజన్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్ డెవలప్ మెంట్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని హెల్డ్కేర్ రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాలఅకడమిక్ డైరెక్టర్ లక్ష్మయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రసన్నరాజు, ప్లేస్మెంట్ కో- ఆర్డినేటర్ మల్లికార్జున, బోధని సిబ్బంది, విద్యార్ధిని విద్యార్థులు
-పాల్గొన్నారు. ఈ సెషన్ లో పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు, కేరీర్ అవకాశాలు – వేతన ప్యాకేజీలు, ఫార్మసీ విద్యార్థుల కేరీర్ రోడ్ మ్యాప్ వంటి అంశాల పై మార్గదర్శనం చేసారు.

ఫార్మసీ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు

ఫార్మసీ విద్యతో అపార ఉద్యోగ అవకాశాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *