వార్త ముఖ్యాంశాలు
- అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
- ప్రిన్సిపాల్ డా.
- ఆర్.
అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ విభాగం, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమకుమారి మాట్లాడుతూ రొమ్ము, గర్భాశయ ముఖద్వార, ఊపిరితిత్తులు, నోటి, చర్మ క్యాన్సర్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. పొగాకు, ధూమపానం, మద్యపానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పి. చలపతిరావు, డా. కె. రామ్మోహన్, రచయిత మాధవ సనా, రోటరీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.