వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కాళహస్తి, ఆగస్టు 18, (పున్నమి న్యూస్): నెల్లూరులో కాపు, బలిజల ఐక్యతా వేదికగా నూతనంగా నిర్మించిన కాపు భవనాన్ని ప్రముఖ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు.
- ఈ భవన నిర్మాణానికి ప్రముఖ విద్యావేత్త, మంత్రి నారాయణ రూ.
- కోటి ఆర్థిక సాయం అందించగా, ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నాయకులు దాసు, కొట్టే రామ్మూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీ కాళహస్తి, ఆగస్టు 18, (పున్నమి న్యూస్): నెల్లూరులో కాపు, బలిజల ఐక్యతా వేదికగా నూతనంగా నిర్మించిన కాపు భవనాన్ని ప్రముఖ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి ప్రముఖ విద్యావేత్త, మంత్రి నారాయణ రూ. కోటి ఆర్థిక సాయం అందించగా, ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో నాయకులు దాసు, కొట్టే రామ్మూర్తి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రజా బంధు’, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ శ్రీ సాయి కొట్టే మాట్లాడుతూ.. తరతరాల ఆత్మబంధమైన కాపు-బలిజల ఐక్యతకు, యువత మార్గదర్శకత్వానికి పెద్దల ఆశ్రయానికి ఈ నిలయం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసికట్టుగా అడుగు ముందుకు వేస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సుమారు 5,000 మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవన నిర్మాణానికి, నిర్వహణకు సహకరించిన నాయకులకు నిర్వాహకులకు కొట్టే సాయి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.