అరకులోయ మండలం చొంపి పంచాయతీ కొత్తవలస గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూజ్ బాక్స్ వైర్లు పిల్లలకు అందేలా ఉండటంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. రక్షణ కంచ లేకపోవడంతో వాహనదారులు, విద్యార్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. తరచూ షార్ట్‌సర్క్యూట్‌తో నిప్పురవ్వలు వస్తున్నాయని తెలిపారు. వాలిపోయిన విద్యుత్ స్తంభాన్ని సరిచేసి, ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

అరకు: చొంపి కొత్తవలసలో ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్