Tuesday, 18 August 2026
  • Home  
  • అనారోగ్య బాధలు తాళలేక పురుగుమందు సేవించిన వృద్ధుడు మృతి
- విశాఖపట్నం

అనారోగ్య బాధలు తాళలేక పురుగుమందు సేవించిన వృద్ధుడు మృతి

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,(పున్నమి ప్రతినిధి ), విశాఖపట్నం, ఆగస్టు 17: ఆనందపురం మండలం దిబ్బడిపాలెం గ్రామానికి చెందిన యెనుగుల సన్నిబాబు (70) అనారోగ్యంతో పురుగుమందు సేవించి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సన్నిబాబు గత ఏడాది కాలంగా తీవ్ర చర్మవ్యాధితో బాధపడుతున్నారు. శరీరమంతా పుండ్లు, గాయాలతో ఇబ్బంది పడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆగస్టు 14న రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పురుగుమందు సేవించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కొత్తవలసలోని ఓ క్లినిక్‌కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 17న సాయంత్రం మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్‌సీ-2049 ఎస్. పార్థసారథికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం,(పున్నమి ప్రతినిధి ), విశాఖపట్నం, ఆగస్టు 17:
ఆనందపురం మండలం దిబ్బడిపాలెం గ్రామానికి చెందిన యెనుగుల సన్నిబాబు (70) అనారోగ్యంతో పురుగుమందు సేవించి మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సన్నిబాబు గత ఏడాది కాలంగా తీవ్ర చర్మవ్యాధితో బాధపడుతున్నారు. శరీరమంతా పుండ్లు, గాయాలతో ఇబ్బంది పడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

ఈ క్రమంలో ఆగస్టు 14న రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పురుగుమందు సేవించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కొత్తవలసలోని ఓ క్లినిక్‌కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆగస్టు 17న సాయంత్రం మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హెచ్‌సీ-2049 ఎస్. పార్థసారథికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.