బోథ్, ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి ): తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మైలి నారాయణ, ఉపసర్పంచ్ సుద్దుల అరుణ్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ కుమార్, జీపీఓ రామ్ చందర్, రేషన్ డీలర్ కొక్కుల స్వామి, గ్రామస్తులు బిక్క నారాయణ, ఎక్కర్ల రమేష్, అలిశెట్టి గణేష్, సిరిపురం విజయ్, నిమ్మల నారాయణ, బేతం బోజన్న తదితరులు పాల్గొన్నారు.



