గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ ఆవరణలో *వెరిటాస్ జూనియర్ కాలేజీ* ఆవరణలో సోమవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రదాత *స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం* ఏర్పాటు చేసిన *ఎం.వి. రావు ఫౌండేషన్* ఆధ్వర్యంలో *ఉచిత నేత్ర వైద్య శిబిరం* నిర్వహించారు.
వెరిటాస్ జూనియర్ కళాశాల చైర్మన్ మరియు కరస్పాండెంట్ నాదెండ్ల హరిబాబు, సుకుమార్ నాయుడు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
ముందుగా స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజలవన చేసారు.
గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ ఇతర ప్రాంతాల నుంచి కంటి సమస్యలతో బాధపడే వారు ఈ శిబిరానికి హాజరయ్యారు.
కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ నేత్ర వైద్యుడు డాక్టర్ వి .రమేష్ బాబు నేత్ర సమస్యలతో బాధపడే వారికి కంప్యూటర్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించారు.
ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం ద్వారా 11701 కార్యక్రమంగా నిర్వహించారు.
గూడూరు పట్టణం నుంచి వందల మంది ఈ శిబిరానికి హాజరై నేత్ర సమస్యలను చూపించుకున్నారు.
దృష్టిలోపం ఉన్న వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు పంపిణీ చేయనున్నామని, కంటిలో శుక్లాలు ఇతర సమస్యలతో బాధపడేవారికి తిరుపతి పట్టణానికి చెందిన వాసన ఐ కేర్ లో శస్త్ర చికిత్సలు చేయించి వారికి నెలకు సరిపడా మందులను ఉచితంగా ఇవ్వనున్నామని ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో
ఎం వి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి, డాక్టర్ సుగుణమ్మ, ప్రిన్సిపాల్ దొగ్గోలు బాబు రెడ్డి, కోలా మీరయ్య నాయుడు అంగన్వాడి టీచర్ ఎం షాజీదా కళాశాల అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థులు గూడూరు పట్టణ వాసులు పాల్గొన్నారు.



