డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ రోజున విద్యార్థులకు ఖాళీ ప్రశంసా పత్రాలు అందించడం పట్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి మహబూబ్ భాషా విచారణ చేపట్టారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన డీఈవో సోమవారం పాఠశాలను సందర్శించి హెచ్ఎం ను వివరణ అడిగారు. భవిష్యత్తులో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాల హెచ్ఎం అంబ డిఈఓ కు సంజాయిషీ లెటర్ వ్రాసి ఇచ్చారు. అనంతరం తరగతి గదులను పరిశీలించిన డీఈవో ఉపాధ్యాయులు బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా పనిచేయాలని ఈ సందర్భంగా డిఇఓ సూచించారు. ఆయన వెంట ఎంఈఓ వెంకటరమణ పాల్గొన్నారు.

కాట్రేనికోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీఈవో మహబూబ్ బాషా విచారణ