Monday, 17 August 2026
  • Home  
  • *చంద్రబాబు విజన్‌తో… దివాకర్ రెడ్డి చొరవతో… ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’ కార్యరూపం దిశగా
- తిరుపతి

*చంద్రబాబు విజన్‌తో… దివాకర్ రెడ్డి చొరవతో… ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’ కార్యరూపం దిశగా

తిరుపతి ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి *తిరుపతిని “చెరువులు – సరస్సుల నగరం” (City of Lakes and Tanks) గా తీర్చిదిద్దే బృహత్తర ప్రాజెక్టు సీఎం ఆదేశాలతో తిరుపతిలో జలవనరుల పునరుజ్జీవం; రుణ సహాయంపై జర్మనీ ‘కె.ఎఫ్.డబ్ల్యూ’ (KfW) ప్రతినిధులతో తుడా చైర్మన్ ఉన్నతస్థాయి సమీక్ష. *ఆర్థిక ఆంక్షలున్నా వెనక్కితగ్గేదే లేదు: సీఎం ప్రత్యేక చొరవతో తిరుపతి చెరువులకు పునర్జీవం* తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్ గోవింద రావు తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’గా (సరస్సులు, చెరువుల నగరం) అభివృద్ధి చేసే లక్ష్యంతో తుడా రూపొందించిన రూ. 750 కోట్ల ‘క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు’లో మరో కీలక అడుగు పడింది. తిరుపతి నగరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా, తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’ (సరస్సులు మరియు చెరువుల నగరం) గా తీర్చిదిద్దాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తుడా ఛైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజన్, తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల దిశగా సాగుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు DPR మరియు అమలు ప్రక్రియ వైపు ముందుకు సాగుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం జర్మనీకి చెందిన ప్రసిద్ధ ‘కె.ఎఫ్.డబ్ల్యూ’ (KfW) బ్యాంకు ప్రతినిధులతో తుడా కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది. గతంలో ఢిల్లీలో జరిగిన ‘ICLEI’ సదస్సు సందర్భంగా అంతర్జాతీయ సంస్థలతో, ముఖ్యంగా KfW ప్రతినిధులతో జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ,వైస్ చైర్మన్ ఆర్ గోవింద రావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుడా ఛైర్మన్ డా.డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఈ చర్చలు, రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ ఆమోదం అనంతరం ఇప్పుడు డీపీఆర్, ఆర్థిక సమీకరణ దిశగా ముందుకు సాగడం తిరుపతి అభివృద్ధిలో ఒక కీలక పరిణామం.రాష్ట్రంలో ఆర్థికపరమైన పరిమితులు ఉన్నప్పటికీ,ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని KfW నుండి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు DPR, సాంకేతిక అధ్యయనాలు, ఆర్థిక సమీకరణ, చెరువుల పునరుద్ధరణ, సహజ జల అనుసంధానాలు, వరద నివారణ, సమగ్ర స్టార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు సుమారు 25 చెరువులు, కుంటలను పునరుద్ధరించడం, వాటి మధ్య సహజ జలమార్గాలను పునరుద్ధరించడం, భూగర్భ జలాల సంరక్షణ, వరద ముప్పును తగ్గించడం మరియు బ్లూ-గ్రీన్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. నీటి వనరుల్లోకి మురుగునీరు (Sewage) చేరడం వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తుడా పూర్తి నిబద్ధతతో ఉందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ లు,అధ్యయనాలు చేయాల్సిన అవసరం తమకు తెలుసునని, అయితే ఎంపిక చేసిన కొన్ని చెరువుల్లో వచ్చే జనవరి మధ్య నాటికి పనులను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకొని,మిగిలిన అన్ని చెరువుల అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని చెప్పారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ఒప్పందాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా,మార్చి 2027 లోపు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. తుడా పరిధిలో ఉన్న పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని, ప్రాజెక్టు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని పనిచేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి గారి ఆశయమైన తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’గా మార్చే ఈ కలను సాకారం చేయడంలో జర్మనీకి చెందిన KfW బ్యాంకు నుండి బలమైన మద్దతును ఆశిస్తున్నట్లు తుడా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు కమిషనర్ శారద దేవి, తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, సీపిఓ దేవికుమారి,తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి ఆగస్టు 17 పున్నమి ప్రతినిధి

*తిరుపతిని “చెరువులు – సరస్సుల నగరం” (City of Lakes and Tanks) గా తీర్చిదిద్దే బృహత్తర ప్రాజెక్టు సీఎం ఆదేశాలతో తిరుపతిలో జలవనరుల పునరుజ్జీవం; రుణ సహాయంపై జర్మనీ ‘కె.ఎఫ్.డబ్ల్యూ’ (KfW) ప్రతినిధులతో తుడా చైర్మన్ ఉన్నతస్థాయి సమీక్ష. *ఆర్థిక ఆంక్షలున్నా వెనక్కితగ్గేదే లేదు: సీఎం ప్రత్యేక చొరవతో తిరుపతి చెరువులకు పునర్జీవం*
తుడా ఛైర్మన్ డా డాలర్స్ దివాకర్ రెడ్డి , వైస్ ఛైర్మన్ ఆర్ గోవింద రావు తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’గా (సరస్సులు, చెరువుల నగరం) అభివృద్ధి చేసే లక్ష్యంతో తుడా రూపొందించిన రూ. 750 కోట్ల ‘క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టు’లో మరో కీలక అడుగు పడింది. తిరుపతి నగరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా, తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’ (సరస్సులు మరియు చెరువుల నగరం) గా తీర్చిదిద్దాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తుడా ఛైర్మన్ తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజన్, తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల దిశగా సాగుతున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు DPR మరియు అమలు ప్రక్రియ వైపు ముందుకు సాగుతోంది. ఈ బృహత్తర ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం కోసం జర్మనీకి చెందిన ప్రసిద్ధ ‘కె.ఎఫ్.డబ్ల్యూ’ (KfW) బ్యాంకు ప్రతినిధులతో తుడా కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరిగింది. గతంలో ఢిల్లీలో జరిగిన ‘ICLEI’ సదస్సు సందర్భంగా అంతర్జాతీయ సంస్థలతో, ముఖ్యంగా KfW ప్రతినిధులతో జరిగిన చర్చలకు కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాలర్స్ దివాకర్ రెడ్డి ,వైస్ చైర్మన్ ఆర్ గోవింద రావు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుడా ఛైర్మన్ డా.డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవతో అంతర్జాతీయ స్థాయిలో ప్రారంభమైన ఈ చర్చలు, రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయ ఆమోదం అనంతరం ఇప్పుడు డీపీఆర్, ఆర్థిక సమీకరణ దిశగా ముందుకు సాగడం తిరుపతి అభివృద్ధిలో ఒక కీలక పరిణామం.రాష్ట్రంలో ఆర్థికపరమైన పరిమితులు ఉన్నప్పటికీ,ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని KfW నుండి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణమైన అనుమతిని మంజూరు చేసింది. ఈ సమావేశంలో ప్రాజెక్టు DPR, సాంకేతిక అధ్యయనాలు, ఆర్థిక సమీకరణ, చెరువుల పునరుద్ధరణ, సహజ జల అనుసంధానాలు, వరద నివారణ, సమగ్ర స్టార్మ్ వాటర్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు సుమారు 25 చెరువులు, కుంటలను పునరుద్ధరించడం, వాటి మధ్య సహజ జలమార్గాలను పునరుద్ధరించడం, భూగర్భ జలాల సంరక్షణ, వరద ముప్పును తగ్గించడం మరియు బ్లూ-గ్రీన్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలు. నీటి వనరుల్లోకి మురుగునీరు (Sewage) చేరడం వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తుడా పూర్తి నిబద్ధతతో ఉందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ లు,అధ్యయనాలు చేయాల్సిన అవసరం తమకు తెలుసునని, అయితే ఎంపిక చేసిన కొన్ని చెరువుల్లో వచ్చే జనవరి మధ్య నాటికి పనులను ప్రారంభించాలని లక్ష్యంగా చేసుకొని,మిగిలిన అన్ని చెరువుల అభివృద్ధి పనులను దశలవారీగా చేపడతామని చెప్పారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రుణ ఒప్పందాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా,మార్చి 2027 లోపు పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
తుడా పరిధిలో ఉన్న పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని, ప్రాజెక్టు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో కూడా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని పనిచేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి గారి ఆశయమైన తిరుపతిని ‘సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ట్యాంక్స్’గా మార్చే ఈ కలను సాకారం చేయడంలో జర్మనీకి చెందిన KfW బ్యాంకు నుండి బలమైన మద్దతును ఆశిస్తున్నట్లు తుడా చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి అదనపు కమిషనర్ శారద దేవి, తుడా సెక్రటరీ డా యన్ వి శ్రీకాంత్ బాబు, ఎస్ ఈ రవీంద్రయ్య, సీపిఓ దేవికుమారి,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.