Sunday, 16 August 2026
  • Home  
  • జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ విజేత ఉదయ్ భాస్కర్ కి ఘన సత్కారం!
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ విజేత ఉదయ్ భాస్కర్ కి ఘన సత్కారం!

జాతీయ స్థాయి విద్యుత్ శాఖ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచిన ఉదయ్ భాస్కర్ ని ఆత్మకూరు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DyEE) శ్రీ చిన్నస్వామి నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ — “ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి, సరైన సదుపాయాలు లేకపోయినా పట్టుదలతో సాధన చేసి జాతీయ స్థాయిలో ఈ విజయం సాధించడం నిజంగా ఎంతో ప్రశంసనీయం. ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని తోటి ఉద్యోగులకు, యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ చిన్నస్వామి నాయక్ తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs), విద్యుత్ శాఖ ఉద్యోగులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఉదయ్ భాస్కర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

జాతీయ స్థాయి విద్యుత్ శాఖ బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచిన ఉదయ్ భాస్కర్ ని ఆత్మకూరు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DyEE) శ్రీ చిన్నస్వామి నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ — “ఒక మారుమూల గ్రామం నుండి వచ్చి, సరైన సదుపాయాలు లేకపోయినా పట్టుదలతో సాధన చేసి జాతీయ స్థాయిలో ఈ విజయం సాధించడం నిజంగా ఎంతో ప్రశంసనీయం. ఈ విజయం గ్రామీణ ప్రాంతాల్లోని తోటి ఉద్యోగులకు, యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ చిన్నస్వామి నాయక్ తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs), విద్యుత్ శాఖ ఉద్యోగులు మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని ఉదయ్ భాస్కర్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.