దుత్తలూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ (ZPHS) పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. స్కూల్ హెచ్ఎం రమణమ్మ , టీచర్ జి పెంచల రత్నం పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.

దుత్తలూరు ZPHSలో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు