Thursday, 1 October 2026
  • Home  
  • 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్,
- నిజామాబాద్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్,

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ మంత్రి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఘన నివాళులు అర్పించి, వారి త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. బలమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ మంత్రి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఘన నివాళులు అర్పించి, వారి త్యాగాలను మంత్రి స్మరించుకున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో దేశాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. బలమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణతో పాటు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి మనమంతా కలిసికట్టుగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.