కాగజ్‌నగర్ పట్టణంలోని జాతీయ తెలంగాణ మాల మహానాడు కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి సందేశాలను అందించారు.కార్యక్రమంలో మాల మహానాడు నిర్వాహకులు, సభ్యులు, , పాల్గొని దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధి, ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.


