నంద్యాల : రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ సభ జరిగిన ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడాన్ని నంద్యాల కాంగ్రెస్ అధ్యక్షులు దాసరి చింతలయ్య తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినందున సభా ప్రదేశాన్ని శుద్ధి చేయడం దళిత సమాజాన్ని అవమానించడమేనని అన్నారు.ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని, సామాజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని చింతలయ్య తెలిపారు.

రామ్లీలా మైదానం శుద్ధి ఘటనపై నంద్యాల కాంగ్రెస్ ఆగ్రహం.. బాధ్యుల అరెస్టుకు డిమాండ్