Thursday, 13 August 2026
  • Home  
  • శుభ్రత పనులు ముమ్మరం
- BHADRADRI

శుభ్రత పనులు ముమ్మరం

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు, 13,(పున్నమి ప్రతినిధి) రామవరం లో 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వార్డు కౌన్సిలర్ ముని గడప పద్మ ఆధ్వర్యంలో సిబ్బంది మురుగు కాలువల పక్కన పేరుకుపోయిన చెత్త, ఎండిన కొమ్మలు, వ్యర్థాలను తొలగించారు. వర్షాకాలంలో కాలువలు మూసుకుపోకుండా మురుగు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పనులు చేపట్టినట్టు చెప్పారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు ప్రజలు కూడా చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకుండా సహకరించాలని కౌన్సిలర్ పద్మ కోరారు. వార్డులో అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. స్థానికులు కూడా సహకరిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

బద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండలం ఆగస్టు, 13,(పున్నమి ప్రతినిధి)

రామవరం లో 16వ వార్డులో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. వార్డు కౌన్సిలర్ ముని గడప పద్మ ఆధ్వర్యంలో సిబ్బంది మురుగు కాలువల పక్కన పేరుకుపోయిన చెత్త, ఎండిన కొమ్మలు, వ్యర్థాలను తొలగించారు. వర్షాకాలంలో కాలువలు మూసుకుపోకుండా మురుగు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పనులు చేపట్టినట్టు చెప్పారు. ప్రజలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వార్డు ప్రజలు కూడా చెత్తను రోడ్లపై లేదా కాలువల్లో వేయకుండా సహకరించాలని కౌన్సిలర్ పద్మ కోరారు. వార్డులో అవసరమైన ప్రాంతాల్లో ఇలాంటి శుభ్రత కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. స్థానికులు కూడా సహకరిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.