ఖమ్మం ఆగష్టు 11
(పున్నమి ప్రతినిధి)
ఖమ్మం: పట్టా పాస్‌బుక్కులు లేని రైతులకు ఎరువులు అందించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఖమ్మం జిల్లా అధ్యక్షులు పగడవరపు శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ పుల్లయ్యను కలిసి రైతుల సమస్యపై చర్చించారు. గతంలో పాస్‌బుక్కులు లేని రైతులు యూరియా కోసం ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రైతులకు అన్యాయం జరగకుండా జిల్లా కలెక్టర్‌తో మరోసారి చర్చించి చర్యలు తీసుకుంటామని శ్రీ పుల్లయ్య హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని శ్రీనివాసరావు కోరారు.



