కామారెడ్డి, 09 జులై, ( పున్నమి ప్రతినిధి ) :. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, అమ్మవారి సంబరాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేం ద్రంతో పాటు వివిధ గ్రామాల్లో అత్యంత ఘనంగా, పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఆచార సంప్రదాయాలు ఉట్టి పడేలా మహిళలు తల పైన బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి గ్రామ దేవ తలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఒకటవ డిపో గౌడ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా బోనాలు…ఇందులో భాగంగానే రామారెడ్డి మం డల కేంద్రంలోని ఒకటవ డిపో గౌడ సంఘం సభ్యులు స్థానిక ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామ దేవత ఎల్లమ్మ తల్లికి ఘనంగా బోనాలు సమర్పించారు. తొలుత మహిళలు కొత్త కుండలను వేప ఆకులు, పసు పు-కుంకుమలతో సుందరంగా అలంకరించి, వాటిపై దీపాలు వెలిగించి తలలపై నిలుపుకున్నా రు.మంగళవాయిద్యాలు, డప్పు చప్పుళ్లు,శివ స త్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సాగిన ఈ బోనా ల ఊరేగింపు వీధుల్లో కోలాహ లంగా సాగింది. భక్తుల జై ఎల్లమ్మ తల్లీ నామ స్మరణతో రామారెడ్డి ప్రాంతం మార్మోగింది.అమ్మ వారికి ప్రత్యేక పూజలు.. మొక్కుల చెల్లింపు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడిపంట లు సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురిసి రైతన్నలు ఆనందంగా ఉండా లని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నారు.ఆలయ అర్చకులు శాస్త్రోక్తం గా అమ్మవారికి ప్రత్యేక పూజలు,కుంకుమార్చనలు నిర్వహించి, భక్తు లకు తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్య క్షులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సభ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రామారెడ్డిలో వైభవంగా ఆషాడ మాస బోనాలు.. భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మకు నైవేద్య సమర్పణ!