Sunday, 9 August 2026
  • Home  
  • వంతెన కోసం దశాబ్దాల నిరీక్షణ… అధికారల నిర్లక్ష్యంతో రెండు గ్రామాల ప్రజల అవస్థలు
- News

వంతెన కోసం దశాబ్దాల నిరీక్షణ… అధికారల నిర్లక్ష్యంతో రెండు గ్రామాల ప్రజల అవస్థలు

దొరిమిల్ల ఒరే ఉప్పొంగితే గ్రామాలు బందీ… చదువుకు దూరమవుతున్న విద్యార్థులు జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాల ప్రజల ఆవేదన దహేగాం, ఆగస్టు 9 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని కొత్మీర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా గ్రామస్తుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ గ్రామాల ప్రజలకు కష్టాల కాలమే. జండగూడ–దుబ్బగూడ గ్రామాల్లో సుమారు 300 మంది, దేవాజిగూడలో 100 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు, నిత్యావసర అవసరాల కోసం ప్రతిరోజూ కాగజ్‌నగర్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది. గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఒరే పై ఇప్పటికీ వంతెన లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఒరే ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు గ్రామాల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. కొన్నిసార్లు రోజుల తరబడి గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి. ఈ రెండు గ్రామాల నుంచి ప్రతిరోజూ 20 నుంచి 30 మంది విద్యార్థులు సమీప గ్రామాలు, కాగజ్‌నగర్ బిబ్రా దహేగం ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. వాగు ఉప్పొంగిన రోజుల్లో వారు విద్యాసంస్థలకు వెళ్లలేక చదువుకు అంతరాయం కలుగుతోంది. పరీక్షల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారిని, గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం కూడా కష్టంగా మారుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితులు తరచూ ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యవసాయ కూలీలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల రవాణా కూడా నిలిచిపోవడంతో గ్రామాల్లో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, గ్రామస్తుల ప్రాణ భద్రత దృష్ట్యా జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాలను కలిపే ఒరే పై శాశ్వత వంతెన నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఏడాది పొడవునా సురక్షిత రాకపోకలు అందుబాటులోకి రావడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

దొరిమిల్ల ఒరే ఉప్పొంగితే గ్రామాలు బందీ… చదువుకు దూరమవుతున్న విద్యార్థులు

జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాల ప్రజల ఆవేదన

దహేగాం, ఆగస్టు 9 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని కొత్మీర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా గ్రామస్తుల సమస్య మాత్రం అలాగే కొనసాగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ గ్రామాల ప్రజలకు కష్టాల కాలమే.

జండగూడ–దుబ్బగూడ గ్రామాల్లో సుమారు 300 మంది, దేవాజిగూడలో 100 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు, నిత్యావసర అవసరాల కోసం ప్రతిరోజూ కాగజ్‌నగర్ పట్టణానికి వెళ్లాల్సి వస్తుంది.

గ్రామాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఒరే పై ఇప్పటికీ వంతెన లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఒరే ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు గ్రామాల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. కొన్నిసార్లు రోజుల తరబడి గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతున్నాయి.

ఈ రెండు గ్రామాల నుంచి ప్రతిరోజూ 20 నుంచి 30 మంది విద్యార్థులు సమీప గ్రామాలు, కాగజ్‌నగర్ బిబ్రా దహేగం ప్రాంతంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకుంటున్నారు. వాగు ఉప్పొంగిన రోజుల్లో వారు విద్యాసంస్థలకు వెళ్లలేక చదువుకు అంతరాయం కలుగుతోంది. పరీక్షల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారిని, గర్భిణులను ఆసుపత్రులకు తరలించడం కూడా కష్టంగా మారుతోంది. ప్రాణాలను పణంగా పెట్టి వాగు దాటాల్సిన పరిస్థితులు తరచూ ఏర్పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

వ్యవసాయ కూలీలు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఇదే సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల రవాణా కూడా నిలిచిపోవడంతో గ్రామాల్లో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి.

ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

విద్యార్థుల భవిష్యత్తు, గ్రామస్తుల ప్రాణ భద్రత దృష్ట్యా జండగూడ–దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాలను కలిపే ఒరే పై శాశ్వత వంతెన నిర్మించాలని రెండు గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఏడాది పొడవునా సురక్షిత రాకపోకలు అందుబాటులోకి రావడంతో పాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.