కొత్తగూడెం:- పున్నమి వార్తలు 07/08/2026
ఆచార్య జయశంకర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి –మోర్ పార్వతీ భాస్కర్
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకుడు సంకుబాపన అనుదీప్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనుదీప్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన పునాది వేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని ఆయన ఆశయాలను గుర్తుచేస్తూ, ఆ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఆత్మగౌరవం, రాష్ట్ర హక్కులు, అభివృద్ధి పరిరక్షించబడతాయని పేర్కొంటూ, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ఆచార్య జయశంకర్ గారికి ఘనంగా నివాళులర్పించారు.


