Tuesday, 4 August 2026
  • Home  
  • *భారత ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలసిన ఏపి కూటమి ఎంపీల బృందం*
- తిరుపతి

*భారత ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలసిన ఏపి కూటమి ఎంపీల బృందం*

*ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు “అమరావతి” పుస్తక ప్రతి అందజేత* *ఏపీ సీఎం చంద్రబాబు దూర దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని కొనియాడిని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు* చిత్తూరు (న్యూఢిల్లీ)04 (పున్నమి ప్రతినిధి) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూర దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని కొనియాడారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు. బుధవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో తన సహచర ఎంపిల బృందంతో కలసి..భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ను.., ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా “అమరావతి: ప్రజలచే నిర్మించబడింది, విధిచే రక్షించబడింది” అనే కాఫీ టేబుల్ బుక్ ప్రతిని ఉపరాష్ట్రపతికి అందజేసినట్లు చిత్తూరు ఎంపీ దగ్గమళ్ళ ప్రసాదరావు చెప్పారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు-మహిళలు సాగించిన 1,631 రోజుల పోరాటం, అలాగే 2024 జూన్ 2 నుండి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక నిర్ణయం వంటి అంశాలను ఈ పుస్తకం కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల సమర్థవంతమైన నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రజల ఆకాంక్షల మేరకు ప్రపంచ స్థాయి రాజధానిగా, సంపద సృష్టి, ఆవిష్కరణ, ఆధునిక సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేంకు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ఎంపిల బృందం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు………….

*ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌కు “అమరావతి” పుస్తక ప్రతి అందజేత*

*ఏపీ సీఎం చంద్రబాబు దూర దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని కొనియాడిని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు*

చిత్తూరు (న్యూఢిల్లీ)04 (పున్నమి ప్రతినిధి)

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూర దృష్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వరమని కొనియాడారు టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు.

బుధవారం చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో తన సహచర ఎంపిల బృందంతో కలసి..భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ను.., ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా “అమరావతి: ప్రజలచే నిర్మించబడింది, విధిచే రక్షించబడింది” అనే కాఫీ టేబుల్ బుక్ ప్రతిని ఉపరాష్ట్రపతికి అందజేసినట్లు చిత్తూరు ఎంపీ దగ్గమళ్ళ ప్రసాదరావు చెప్పారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం, రైతులు-మహిళలు సాగించిన 1,631 రోజుల పోరాటం, అలాగే 2024 జూన్ 2 నుండి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక నిర్ణయం వంటి అంశాలను ఈ పుస్తకం కళ్ళకు కట్టినట్లు వివరిస్తుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల సమర్థవంతమైన నాయకత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వ సహకారంతో అమరావతిని ప్రజల ఆకాంక్షల మేరకు ప్రపంచ స్థాయి రాజధానిగా, సంపద సృష్టి, ఆవిష్కరణ, ఆధునిక సాంకేతికతకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేంకు మన ఆంధ్రప్రదేశ్ కూటమి ఎంపిల బృందం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలిపారు………….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.