ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లాలోని గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది. జిల్లాలోని 565 గ్రామ పంచాయతీలకు మొత్తం రూ.31.73 కోట్ల నిధులు మంజూరు కాగా, సంబంధిత గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమయ్యాయి. ఈ నిధులను పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, వీధి దీపాలు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులకు వినియోగించనున్నారు. నిధుల విడుదలతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరనుందని అధికారులు తెలిపారు.



