తిరుచానూరు, ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సోమవారం ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో ఉడిపి, పలిమారు మఠం పీఠాధిపతులు శ్రీ విద్యదీశ తీర్థ స్వామిజి, మాజీ ఎంపీ, తెలుగు సినీ నటుడు మురళీకృష్ణ వేరు వేరు సమయాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ డిప్యూటీ ఈఓ హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, సూపరింటెండెంట్లు ముని చెంగల్రాయలు, సురేష్ , రమేష్, ఇన్స్పెక్టర్ చలపతి, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.



