బద్రాద్రి కొత్తగూడెం.ఆగస్ట్ 1.(పున్నమి న్యూస్)
మహారాష్ట్రలోని నాగ్పూర్లో 17 ఏళ్ల యువ క్రికెటర్ అదితి చౌఖాండే బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత స్థాయి జట్టుకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్లో తల్లిదండ్రులను గర్వపడేలా చేయలేకపోయానని, తన అన్నయ్య గొప్ప క్రికెటర్ కావాలని ఆకాంక్షించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.



