కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR – Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్‌తో పాటు ఖమ్మం నగరంలోని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ సందర్భంగా, ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారం పూర్తి చేసి, బీఎల్వో (BLO) ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోని ఓటర్లు వెంటనే తమ వివరాలను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫారం నింపడం లేదా ఆన్లైన్ నమోదు విషయంలో సహాయం అవసరమైన వారు సంప్రదిస్తే అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
“రాజ్యాంగం కల్పించిన మన ఓటు మన హక్కు” అనే సందేశంతో ప్రతి అర్హత కలిగిన ఓటరు ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఓటరు వివరాలను సరిచేసుకోవాలని కోరారు.



