అనకాపల్లి జిల్లా, జూలై 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామ కార్యదర్శి ఇన్‌చార్జ్ కె. గిరిప్రసాద్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏటికొప్పాకలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
పారిశుద్ధ్య కార్మికులను పెంచి వీధివీధిలో శుభ్రత పనులు చేపట్టడంతో పాటు, గ్రామ ముఖద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను క్రేన్ మిషన్‌తో తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామంలో ఎక్కడ సమస్య ఉన్నా స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందితో పనులను దగ్గరుండి చేయిస్తున్నారు.
అలాగే శానిటైజేషన్, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక మైక్ ద్వారా గ్రామంలో అనౌన్స్‌మెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ గిరిప్రసాద్ రావు తీసుకుంటున్న చర్యలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

ఏటికొప్పాక పరిశుభ్రతకు కార్యదర్శి గిరిప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ.. పెరిగిన పారిశుద్ధ్య పనులు!
అనకాపల్లి జిల్లా, జూలై 30 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామ కార్యదర్శి ఇన్‌చార్జ్ కె. గిరిప్రసాద్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగు గ్రామాలకు ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏటికొప్పాకలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులను పెంచి వీధివీధిలో శుభ్రత పనులు చేపట్టడంతో పాటు, గ్రామ ముఖద్వారం వద్ద పేరుకుపోయిన చెత్తను క్రేన్ మిషన్‌తో తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామంలో ఎక్కడ సమస్య ఉన్నా స్వయంగా పరిశీలిస్తూ సిబ్బందితో పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. అలాగే శానిటైజేషన్, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక మైక్ ద్వారా గ్రామంలో అనౌన్స్‌మెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ గిరిప్రసాద్ రావు తీసుకుంటున్న చర్యలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.

