సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలతతో కలిసి ఉచిత శిక్షణ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 7లోపు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సివిల్ సర్వీసెస్‌లో విజయాన్ని సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.



