ఖమ్మం,
ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా షూటింగ్‌లో గాయపడిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఖమ్మంలోని కల్వొడ్డు ప్రాంతంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఎన్‌బీకే సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలకృష్ణ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తిరిగి సినీ, రాజకీయ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అభిమానులు ప్రార్థించారు. అలాగే ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమె పేరుపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్‌బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు తాళ్లూరి శ్రీనివాస్‌రావు, టీడీపీ నాయకుడు కేతినేని హరీష్, ఎన్‌బీకే సేవా సమితి సభ్యులు నల్లమల రంజిత్, నారపాటి రవి, బొడ్డు వెంకటేశ్వర్లు, మోరం పాపారావు, రాము, అభి, బాబు, తాళ్లూరి నారాయణ, రమేష్‌తో పాటు పలువురు అభిమానులు పాల్గొన్నారు.

