పున్నమి న్యూస్ ఎం వెంకయ్య జులై 28 దొరవారిసత్రం మండలం,
తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలం కల్లూరు గ్రామంలో లోని కోటపోలూరు చెరువు సమీపంలో ఉన్న నేల బావిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.
పొలం పనులకు వెళ్లిన గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి వెంటనే దొరవారిసత్రం పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతుడే వివరాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



