Wednesday, 29 July 2026
  • Home  
  • పేదల పొట్టపై భూమాపియ దాడి? 200 కుటుంబాలు ఆందోళనతో దద్దరిల్లిన వాకాడు తాసిల్దార్ కార్యాలయం,,
- గూడూరు

పేదల పొట్టపై భూమాపియ దాడి? 200 కుటుంబాలు ఆందోళనతో దద్దరిల్లిన వాకాడు తాసిల్దార్ కార్యాలయం,,

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 27 వాకాడు మండలం, .తరతరాలుగా సాగు చేస్తున్న 7.45 ఎకరాల భూమిపై రియల్ మాఫియా కన్ను పడిందని ఆరోపణలు, .మా భూమి కాదు అంటూ బయటి వాళ్లతో బెదిరింపులు దిగుతున్నారని మత్స్యకారుల ఆవేదన, . ఆర్డీవో తాసిల్దార్ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదని ఆరోపణ, .. అధికారులు మౌనం వెనక ఆంతర్యం ఏమిటి అవినీతి ఆరోపణలు చేస్తున్న. 200 కుటుంబాల ఆందోళనతో దద్దరిల్లిన తాసిల్దార్ కార్యాలయం, పెద్దల కాలం నుంచి నమ్ముకున్న భూమిని కాపాడుకోవడానికి.. కంటికి రెప్పలా సాగు చేస్తున్న నేలను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడానికి ఆ మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు. తిరుపతి జిల్లా వాకాడ మండలం కొండూరు పాలెం మత్స్యకారుల తమ భూములను తగ్గించుకోవడానికి చేపట్టిన పోరాటం తాసిల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృప్తికు దారితీసింది. సుమారు 200 మందికి పైగా మర్చిపోరులు ఉమ్మడిగా తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి భీకర నినాదాలతో హోరెత్తించారు. .తరతరాల ఉపాధి పై రియల్ మాఫియా కన్ను.. సర్వేనెంబర్ 663 భూములకు పరిరక్షణకు మత్స్యకారులు పోరాటం , దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 663 లో విస్తరించే ఉన్న సుమారు 7.4 ఎకరాల భూమి కొండూరు పాలెం మత్స్యకారుల జీవనధారం. గ్రామంలోని సుమారు 270 కుటుంబాల చేపల వేట పై ఆధారపడుతూ, ఇదే సర్వే నెంబర్ లోనే భూమిని సాగు చేసుకుంటూ తరతరాలుగా జీవనం సాగిస్తున్నాయి. అయితే ఈ భూమిపై కన్ను పడిన నెల్లూరుకు చెందిన కమలేష్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు ఇటీవల గ్రామంలోకి చొరబడి బెదిరింపులకు దిగుతున్నారు అని మత్స్యకారులు తెలిపారు. అధికారులు పాత్ర పై తీవ్ర ఆరోపణలు లంచాలకు తాలొగ్గి పత్రాలు తారుమారు, ఒక గ్రామానికి చెందిన 200 మత్స్యకారుల కుటుంబాలు రోడ్డెక్కి ఇబ్బందులకు పడుతున్న తాసిల్దార్ కార్యాలయం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారులు మౌనం అక్రమాలతో కుమ్మక్కైన వైనం స్పష్టంగా కనిపిస్తుందని పేదల పొట్ట కొట్టి కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి కుట్ర జరుగుతుందని వారు మండిపడ్డారు. .కొండూరు పాలెం కాపులు మరియు మత్స్యకారుల ప్రధాన డిమాండ్లు, సర్వేనెంబర్ 663 లో కమలేష్ రెడ్డి పేరును తక్షణమే తొలగించి తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చాలి. గ్రామంలోకి సమస్యలు భూ కబ్జాదారులు రాకుండా నిషేధించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గూడూరు శాసనసభ్యులు సమక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి భూమిలేని ప్రతి పేద కుటుంబానికి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలి. .భూ పంపిణీ చేయకపోతే ప్రజాప్రతినిధులు కార్యాలయాలు ముట్టడి మత్స్యకారుల హెచ్చరిక, ఇప్పటివరకు గ్రామంలోని ప్రజలందరూ ఉమ్మడిగా భూమిని సాగు చేస్తున్నామని, భవిష్యత్తులో భూ పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరికి వేరేరుగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన స్పందించి న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రజాప్రతినిధులు కార్యాలయాలను ముట్టడిస్తామని మత్స్యకారుల హెచ్చరించారు. అభాగ్యులైన మత్స్యకారుల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.

పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 27 వాకాడు మండలం,

.తరతరాలుగా సాగు చేస్తున్న 7.45 ఎకరాల భూమిపై రియల్ మాఫియా కన్ను పడిందని ఆరోపణలు,
.మా భూమి కాదు అంటూ బయటి వాళ్లతో బెదిరింపులు దిగుతున్నారని మత్స్యకారుల ఆవేదన,
. ఆర్డీవో తాసిల్దార్ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేదని ఆరోపణ,
.. అధికారులు మౌనం వెనక ఆంతర్యం ఏమిటి అవినీతి ఆరోపణలు చేస్తున్న.

200 కుటుంబాల ఆందోళనతో దద్దరిల్లిన తాసిల్దార్ కార్యాలయం,
పెద్దల కాలం నుంచి నమ్ముకున్న భూమిని కాపాడుకోవడానికి.. కంటికి రెప్పలా సాగు చేస్తున్న నేలను అన్యాక్రాంతం కాకుండా చూసుకోవడానికి ఆ మత్స్యకారులు మరోసారి రోడ్డెక్కారు.
తిరుపతి జిల్లా వాకాడ మండలం కొండూరు పాలెం మత్స్యకారుల తమ భూములను తగ్గించుకోవడానికి చేపట్టిన పోరాటం తాసిల్దార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉధృప్తికు దారితీసింది.
సుమారు 200 మందికి పైగా మర్చిపోరులు ఉమ్మడిగా తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి భీకర నినాదాలతో హోరెత్తించారు.

.తరతరాల ఉపాధి పై రియల్ మాఫియా కన్ను.. సర్వేనెంబర్ 663 భూములకు పరిరక్షణకు మత్స్యకారులు పోరాటం ,
దుగరాజపట్నం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 663 లో విస్తరించే ఉన్న సుమారు 7.4 ఎకరాల భూమి కొండూరు పాలెం మత్స్యకారుల జీవనధారం. గ్రామంలోని సుమారు 270 కుటుంబాల చేపల వేట పై ఆధారపడుతూ, ఇదే సర్వే నెంబర్ లోనే భూమిని సాగు చేసుకుంటూ తరతరాలుగా జీవనం సాగిస్తున్నాయి. అయితే ఈ భూమిపై కన్ను పడిన నెల్లూరుకు చెందిన కమలేష్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు ఇటీవల గ్రామంలోకి చొరబడి బెదిరింపులకు దిగుతున్నారు అని మత్స్యకారులు తెలిపారు.

అధికారులు పాత్ర పై తీవ్ర ఆరోపణలు లంచాలకు
తాలొగ్గి పత్రాలు తారుమారు,
ఒక గ్రామానికి చెందిన 200 మత్స్యకారుల కుటుంబాలు రోడ్డెక్కి ఇబ్బందులకు పడుతున్న తాసిల్దార్ కార్యాలయం అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
అధికారులు మౌనం అక్రమాలతో కుమ్మక్కైన వైనం స్పష్టంగా కనిపిస్తుందని పేదల పొట్ట కొట్టి కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి కుట్ర జరుగుతుందని వారు మండిపడ్డారు.

.కొండూరు పాలెం కాపులు మరియు మత్స్యకారుల ప్రధాన డిమాండ్లు,
సర్వేనెంబర్ 663 లో కమలేష్ రెడ్డి పేరును తక్షణమే తొలగించి తిరిగి ప్రభుత్వ భూమిగా మార్చాలి.
గ్రామంలోకి సమస్యలు భూ కబ్జాదారులు రాకుండా నిషేధించి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
గూడూరు శాసనసభ్యులు సమక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి భూమిలేని ప్రతి పేద కుటుంబానికి భూ పంపిణీ కార్యక్రమం చేపట్టాలి.

.భూ పంపిణీ చేయకపోతే ప్రజాప్రతినిధులు కార్యాలయాలు ముట్టడి మత్స్యకారుల హెచ్చరిక,
ఇప్పటివరకు గ్రామంలోని ప్రజలందరూ ఉమ్మడిగా భూమిని సాగు చేస్తున్నామని, భవిష్యత్తులో భూ పంపిణీ ద్వారా ప్రతి ఒక్కరికి వేరేరుగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరితగతిన స్పందించి న్యాయం చేయకపోతే రానున్న రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని, ప్రజాప్రతినిధులు కార్యాలయాలను ముట్టడిస్తామని మత్స్యకారుల హెచ్చరించారు. అభాగ్యులైన మత్స్యకారుల పొట్ట కొడితే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.