Sunday, 26 July 2026
  • Home  
  • టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నూతన
- ఆంధ్రప్రదేశ్

టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నూతన

*🔶టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం**🔷గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో కోట ముస్లిం వీధిలో అభివృద్ధి పనుల ప్రారంభం**♦️కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్**🙏కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు**స్వర్ణసాగరం న్యూస్ ప్రతినిధి**కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని ముస్లిం వీధిలో శిథిలావస్థకు చేరిన పాత సిమెంట్ రోడ్డుకు బదులుగా ప్రజల సౌకర్యార్థం నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో,టీడీపీ నాయకుడు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి,షేక్ జలీల్ అహ్మద్ కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ,ముస్లిం వీధిలోని పాత సిమెంట్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో స్థానికులు,ముఖ్యంగా మహిళలు,వృద్ధులు,విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్థానిక ప్రజల సమస్యను గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా,ఆయన సానుకూలంగా స్పందించి నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించారని చెప్పారు.గ్రామంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని,ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సహకారంతో కోట పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని జలీల్ అహ్మద్ పేర్కొన్నారు.నాణ్యత ప్రమాణాలతో రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కోరారు.పాత రోడ్డు శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలంలో బురద,నీటి నిల్వల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు తెలిపారు. ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణం ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్‌తో పాటు టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్‌కు ముస్లిం వీధి ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.