*భారతీయ* *మజ్దూర్ సంఘం* *ఆధ్వర్యంలో* *జెండా* *ఆవిష్కరణ* *కార్యక్రమం* *ఘనంగా* *నిర్వహణ*
పున్నమి: డిజిటల్ న్యూస్: మండల్ స్టేషన్. ఘనాపూర్ : జిల్లా: జనగామ: రిపోర్టర్. కొలిపాక బీసీ శేఖర్. తేదీ:25/07/2026.
ఈరోజు స్థానిక ఉప తపాలా కార్యాలయం ప్రాంగణంలో భారతీయ మజ్దూర్ సంఘం బి ఎం ఎస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో సంఘం నాయకులు తపాలా శాఖ ఉద్యోగులు మహిళా ఉద్యోగులు మరియు సభ్యులు పాల్గొన్నారు ముందుగా భారతీయ మజ్దూర్ సంఘం జెండాను ఆవిష్కరించి సంఘం సిద్ధాంతాలు కార్మికుల హక్కుల పరిరక్షణ సంక్షేమం మరియు దేశ అభివృద్ధి కార్మికుల పాత్ర పై నాయకులు ప్రసంగించారు ఉద్యోగుల ఐక్యత సేవా బావ మరియు కార్మిక సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు అనంతరం భారత్ మాతాకీ జై మజ్దూర్ సంఘం జిందాబాద్ నినాదాలతో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా హనుమకొండ డివిజన్. బి జి డి కె ఎస్ ప్రెసిడెంట్. అశోక్. ప్రధాన కార్యదర్శి. మనోజ్ కుమార్. వైస్ ప్రెసిడెంట్ నరసన్న. సతీష్. ఇసాక్. రవీందర్. తదితరులు పాల్గొన్నారు.



