Sunday, 26 July 2026
  • Home  
  • అంగన్వాడీలకు ఆధునిక సౌకర్యాలు.. ఇండక్షన్ స్టవ్స్, యూనిఫామ్‌ల పంపిణీ
- తూర్పు గోదావరి

అంగన్వాడీలకు ఆధునిక సౌకర్యాలు.. ఇండక్షన్ స్టవ్స్, యూనిఫామ్‌ల పంపిణీ

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండలం కోటపాడు రామకృష్ణాపురంలో ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు రంగంపేట పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు వంట కోసం ఇండక్షన్ స్టవ్స్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు యూనిఫామ్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కార్యకర్తలు, హెల్పర్లు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. వారి సేవలను ప్రోత్సహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ, సూపర్‌వైజర్లు, రంగంపేట మండల కూటమి నాయకులు, కోటపాడు గ్రామ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

అనపర్తి, జూలై 23 (రమేష్ నాయుడు  పున్నమి ప్రతినిధి):
అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రంగంపేట మండలం కోటపాడు రామకృష్ణాపురంలో ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టు రంగంపేట పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు వంట కోసం ఇండక్షన్ స్టవ్స్, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు యూనిఫామ్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన సేవలు అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కార్యకర్తలు, హెల్పర్లు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు. వారి సేవలను ప్రోత్సహించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీడీపీఓ, సూపర్‌వైజర్లు, రంగంపేట మండల కూటమి నాయకులు, కోటపాడు గ్రామ కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.