నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా బుధవారం ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి స్థానిక ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో పర్యటించారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం పార్క్ నుంచి గణేష్ ఘాట్ వరకు రోడ్డు వెంబడి కమిషనర్ పర్యటించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. ఎన్.టి.ఆర్.నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో అవసరమైన డ్రైను కాలువల పూడిక చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఎన్.టి.ఆర్.నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్ధాలను బహిరంగంగా వేయకుండా స్థానికులకు అవగాహన కల్పించాలని, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.
పి.ఆర్.ఓ
నెల్లూరు నగరపాలక సంస్థ.





