Wednesday, 22 July 2026
  • Home  
  • అటవీ ప్రాంతంలో కోడిపందాలపై పోలీసుల దాడులునలుగురు అరెస్ట్.. నగదు, కోళ్లు, ద్విచక్ర వాహనాల స్వాధీనం
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అటవీ ప్రాంతంలో కోడిపందాలపై పోలీసుల దాడులునలుగురు అరెస్ట్.. నగదు, కోళ్లు, ద్విచక్ర వాహనాల స్వాధీనం

ఆత్మకూరు, జూలై 19 ( పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు మండలం పడకండ్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న కోడిపందాలపై ఆదివారం ఆత్మకూరు పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోడిపందాల కోళ్లు, రూ.7,140 నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులకు అందిన సమాచారం మేరకు ఆత్మకూరు ఎస్సై జంపానీ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడులు నిర్వహించింది. కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని, స్వాధీనం చేసుకున్న నగదు, కోళ్లు, వాహనాలను స్టేషన్‌కు తరలించారు. నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరిస్తూ, ఆత్మకూరు మండల పరిధిలో పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ దాడుల్లో ఆత్మకూరు ఎస్సై జంపానీ కుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.