తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణా శిబిరాన్ని శనివారం నిర్వహించారు.అత్యవసర పరిస్థితులలో గుండె ఆగిపోవడం వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడగల నైపుణ్యాలను వైద్య సిబ్బందికి అందించాలనే లక్ష్యంతో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మరియు ఇండియన్ రీసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారికంగా ధృవీకరణ పొందింది. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు పర్యవేక్షణలో 30 మంది వైద్యులను ఎంపిక చేసి ఒకరోజు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించారు. శిక్షణ పొందిన వైద్యులు భవిష్యత్తులో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర ఆరోగ్య శాఖల సిబ్బందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ మరియు కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ పై శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసినవారికి ధృవీకరణ పత్రము అందజేస్తారని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కెవి శివప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల సి పి ఆర్ మరియు బి ఎల్ ఎస్ శిక్షణ అందించేందుకు అవసరమైన పూర్తి ధృవీకరణను పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గుర్తింపు ద్వారా పెద్ద సంఖ్యలో వైద్యులు, విద్యార్థులు మరియు ఆరోగ్య సిబ్బంది శిక్షణ పొందే అవకాశాలు విస్తరించనున్నాయని, తద్వారా అత్యవసర వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వైద్యులు భవిష్యత్తులో శిక్షకులుగా మరింత మందికి శిక్షణ అందిస్తారన్నారు.ఈ కార్యక్రమానికి అనస్తీసియా విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ డా. పి. సోఫియా సమన్వయ అధికారిగా, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డా. వి.వి. దుర్గాప్రసాద్
సహసమన్వయ అధికారి గా వ్యవహరించారు.
శిక్షణ కార్యక్రమంలో. డా. సూరిశెట్టి శ్రీనివాసరావు సిపిఆర్ యొక్క ప్రాముఖ్యత, గుండె ఆగిపోయిన సందర్భాలలో గోల్డెన్ మినిట్స్ లో తక్షణ స్పందన అవసరం, శిక్షణా విధానాలు, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాల్సిన చర్యలు మరియు శిక్షణ అనంతర కార్యాచరణపై సమగ్రంగా వివరించారు.డా. జె. ప్రవీణ ఈ కార్యక్రమానికి బాహ్య పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వైద్యులకు ఆధునిక మానిక్విన్స్ పై ప్రత్యక్ష ప్రాయోగిక శిక్షణ అందించారు. మానవ శరీర ఆకృతిని పోలిన ఈ శిక్షణా నమూనాలపై ఛాతీ ఒత్తిడులు,కృత్రిమ శ్వాస, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలను అభ్యసింపజేశారు.
ఆధునిక వైద్యరంగంలో ఒక ప్రాణరక్షక నైపుణ్యమని, సరైన సమయంలో సరైన విధంగా నిర్వహించిన
కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ అనేక విలువైన ప్రాణాలను కాపాడగలమని తెలియజేశారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణా శిబిరం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణా శిబిరాన్ని శనివారం నిర్వహించారు.అత్యవసర పరిస్థితులలో గుండె ఆగిపోవడం వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటనే స్పందించి ప్రాణాలను కాపాడగల నైపుణ్యాలను వైద్య సిబ్బందికి అందించాలనే లక్ష్యంతో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మరియు ఇండియన్ రీసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారికంగా ధృవీకరణ పొందింది. ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు పర్యవేక్షణలో 30 మంది వైద్యులను ఎంపిక చేసి ఒకరోజు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహించారు. శిక్షణ పొందిన వైద్యులు భవిష్యత్తులో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్, పారామెడికల్ మరియు ఇతర ఆరోగ్య శాఖల సిబ్బందికి బేసిక్ లైఫ్ సపోర్ట్ మరియు కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ పై శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసినవారికి ధృవీకరణ పత్రము అందజేస్తారని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కెవి శివప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల సి పి ఆర్ మరియు బి ఎల్ ఎస్ శిక్షణ అందించేందుకు అవసరమైన పూర్తి ధృవీకరణను పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ గుర్తింపు ద్వారా పెద్ద సంఖ్యలో వైద్యులు, విద్యార్థులు మరియు ఆరోగ్య సిబ్బంది శిక్షణ పొందే అవకాశాలు విస్తరించనున్నాయని, తద్వారా అత్యవసర వైద్య సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వైద్యులు భవిష్యత్తులో శిక్షకులుగా మరింత మందికి శిక్షణ అందిస్తారన్నారు.ఈ కార్యక్రమానికి అనస్తీసియా విభాగం ప్రొఫెసర్ మరియు హెడ్ డా. పి. సోఫియా సమన్వయ అధికారిగా, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డా. వి.వి. దుర్గాప్రసాద్ సహసమన్వయ అధికారి గా వ్యవహరించారు. శిక్షణ కార్యక్రమంలో. డా. సూరిశెట్టి శ్రీనివాసరావు సిపిఆర్ యొక్క ప్రాముఖ్యత, గుండె ఆగిపోయిన సందర్భాలలో గోల్డెన్ మినిట్స్ లో తక్షణ స్పందన అవసరం, శిక్షణా విధానాలు, అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాల్సిన చర్యలు మరియు శిక్షణ అనంతర కార్యాచరణపై సమగ్రంగా వివరించారు.డా. జె. ప్రవీణ ఈ కార్యక్రమానికి బాహ్య పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న వైద్యులకు ఆధునిక మానిక్విన్స్ పై ప్రత్యక్ష ప్రాయోగిక శిక్షణ అందించారు. మానవ శరీర ఆకృతిని పోలిన ఈ శిక్షణా నమూనాలపై ఛాతీ ఒత్తిడులు,కృత్రిమ శ్వాస, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సిన విధానాలను అభ్యసింపజేశారు. ఆధునిక వైద్యరంగంలో ఒక ప్రాణరక్షక నైపుణ్యమని, సరైన సమయంలో సరైన విధంగా నిర్వహించిన కార్డియో పల్మనరీ రీసస్సిటేషన్ అనేక విలువైన ప్రాణాలను కాపాడగలమని తెలియజేశారు.

