Friday, 17 July 2026
  • Home  
  • ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి
- News

ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కేవీపీఎస్ నాయకుల వినతి ఆసిఫాబాద్, జూలై 17: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మరియు వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కేవీపీఎస్ జిల్లా నాయకులు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్నప్పటికీ, అనేక సంస్థలు ఇప్పటికీ అద్దె భవనాల్లో లేదా శాశ్వత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇరుకైన గదుల్లో ఉండాల్సి వస్తోందని, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, వంటశాలలు, డైనింగ్ హాళ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా తగిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలకు సొంత భవనం మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 1971లో నిర్మించిన సాంఘిక సంక్షేమ వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని, సిర్పూర్ (టి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల–కళాశాలకు శాశ్వత భవనం మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కమిషన్ బృందంతో పరిశీలించి, సొంత భవనాలు లేని అన్ని సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, జిల్లా నాయకుడు మల్లేష్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కోరారు.

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కేవీపీఎస్ నాయకుల వినతి
ఆసిఫాబాద్, జూలై 17: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలు మరియు వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కేవీపీఎస్ జిల్లా నాయకులు వినతిపత్రం సమర్పించారు.
జిల్లాలో వేలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గురుకుల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్నప్పటికీ, అనేక సంస్థలు ఇప్పటికీ అద్దె భవనాల్లో లేదా శాశ్వత భవనాలు లేకుండా కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇరుకైన గదుల్లో ఉండాల్సి వస్తోందని, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, వంటశాలలు, డైనింగ్ హాళ్లు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, ప్రహరీ గోడలు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా తగిన స్థాయిలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు.
రెబ్బెన సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలకు సొంత భవనం మంజూరు చేయాలని, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని 1971లో నిర్మించిన సాంఘిక సంక్షేమ వసతి గృహానికి నూతన భవనం నిర్మించాలని, సిర్పూర్ (టి) సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల–కళాశాలకు శాశ్వత భవనం మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని వారు కోరారు.
అదేవిధంగా జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను కమిషన్ బృందంతో పరిశీలించి, సొంత భవనాలు లేని అన్ని సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, జిల్లా నాయకుడు మల్లేష్ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.