శ్రీ కాళహస్తి, జులై 16, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరి సమస్యను పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం శ్రీకాళహస్తిలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా గ్రీవెన్స్’ కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూసమస్యలు, సంక్షేమ పథకాల అమలు, స్థానిక మౌలిక వసతులు, ఇతర ప్రజా అవసరాలకు సంబంధించిన పలు అర్జీలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి ఆలస్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులను ఫోన్‌లో సంప్రదించి, నిర్దేశిత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, ప్రతి సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పారదర్శక పాలన అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి