Thursday, 16 July 2026
  • Home  
  • NH16పై ఘోర ప్రమాదం: డాల్డా లారీ బోల్తా, డ్రైవర్లకు స్వల్ప గాయాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

NH16పై ఘోర ప్రమాదం: డాల్డా లారీ బోల్తా, డ్రైవర్లకు స్వల్ప గాయాలు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మనుబోలు మండలం పరిధిలోని NH16 జాతీయ రహదారిపై నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు నుండి డాల్డా లోడుతో తెలంగాణకు వెళ్తున్న ఒక లారీని, వెనుక నుండి అతివేగంగా దూసుకొచ్చిన తమిళనాడు కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో డాల్డా లారీ అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. అదృష్టవశాత్తూ, తెలంగాణ లారీ డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా,సురక్షితంగా బయటపడగా, కంటైనర్ డ్రైవర్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.