తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పడమటిపాలెం సాగునీటి సంఘ (సొసైటీ) అధ్యక్షులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు అయిన శ్రీ గంగపట్నం చంద్రశేఖరయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో…. గురువారం వారి స్వగ్రామం సంగం మండలం జంగాల కండ్రిగ గ్రామంలో నిర్వహించిన ఉత్తర క్రియల కార్యక్రమంలో హాజరై …వారి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు….
ఆనం కుటుంబానికి అత్యంత ఆప్తులైన చంద్రశేఖరయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి వారి కుటుంబానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి


