చెరుకుమూడి, జూలై 16: మనుబోలు మండలం చెరుకుమూడిలో అనుమానాస్పదంగా మృతి చెందిన బొల్లి ఏడుకొండలు (40) మృతదేహాన్ని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. చోరీ కేసులో అదుపులోకి తీసుకున్న ఏడుకొండలను స్టేషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా రెండు రోజులపాటు పోలీస్ స్టేషన్లో ఉంచారని ఆరోపించారు. ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సై హనీఫ్పై ఫిర్యాదులు ఉన్నందున ఉన్నతాధికారులు నిష్పక్షపాత దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బొల్లి ఏడుకొండలకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి నివాళి