విషయం : ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ఎన్యుమరేషన్ ప్రక్రియకు ప్రస్తుతం ఇచ్చిన తేదీని పొడిగించాలని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒక పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ…
జిల్లాలో అధికారులు ఇంటింటికి వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా చాలా మంది ప్రజలకు ఫారాలు అందలేదని, అందినా కూడా ఎలా నింపాలో అవగాహన లేక తప్పులు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
“వర్షాలు, పని ఒత్తిడి, అవగాహన లేమి కారణంగా చాలా కుటుంబాలు ఇంకా ఫారాలు పూర్తి చేయలేదు. ఒకవేళ ఫారంలో ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరిచేసుకోవడానికి ప్రజలకు ఇంకొక అవకాశం కల్పించాలి. లేకుంటే అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది” అని చంద్రకాంత్ అన్నారు.
* *యుఎస్ఎఫ్ఐ ప్రధాన డిమాండ్లు:*
1. *తేదీ పొడిగింపు:* SIR ఎన్యుమరేషన్ గడువును కనీసం 15 రోజులు పొడిగించాలి.
2. *రెండో అవకాశం:* ఫారాల్లో తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి.
3. *100% కవరేజ్:* అన్ని బూత్ లెవల్ అధికారులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ఫారాలు పూర్తి చేయించాలి.
4. *అవగాహన:* ప్రతి గ్రామం, బస్తీలో ప్రజలకు ఫారం నింపే విధానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యూఎస్ఎఫ్ఐ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు.
*ఇట్లు*
*ఎం. చంద్రకాంత్*
*జిల్లా అధ్యక్షుడు, యూఎస్ఎఫ్ఐ*
*మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా*


