Sunday, 12 July 2026
  • Home  
  • ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీ కాళహస్తి, జులై 11 : (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజా వినతుల స్వీకరణ’ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆయన నేరుగా వినతులను స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, వైద్య మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా సమస్యలపై తక్షణమే స్పందిస్తూ పారదర్శకమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రజల కోసం క్యాంప్ ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ప్రతి సమస్యకు న్యాయం జరిగేలా తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.