ప్రెస్ నోట్
Punnami అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో చేసిన పోస్ట్ పూర్తిగా అవాస్తవం – మేకపాటి వారి కార్యాలయం
ప్రైమ్9 న్యూస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో “YCPకి మేకపాటి కుటుంబం గుడ్‌బై” అనే శీర్షికతో చేసిన పోస్ట్ పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనది.
మేకపాటి కుటుంబం తరఫున ఎలాంటి రాజకీయ నిర్ణయం గానీ, పార్టీ మార్పుకు సంబంధించిన ప్రకటన గానీ చేయలేదు. ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇటువంటి అసత్య సమాచారాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
ప్రజలను తప్పుదోవ పట్టించే ఈ నిరాధార పోస్ట్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రైమ్9 న్యూస్ యాజమాన్యాన్ని కోరుతున్నాము.
ప్రజలు ఇటువంటి నిరాధార ప్రచారాలను విశ్వసించ వద్దు. ప్రైమ్ 9 న్యూస్ చేసిన ఇలాంటి అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.


