Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీకాకుళం

గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉంది – సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ (శ్రీకాకుళం రూరల్ – నవంబర్ పున్నమి ప్రతినిధి)

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉంది – సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ (శ్రీకాకుళం రూరల్ – నవంబర్ పున్నమి ప్రతినిధి)

వార్త ముఖ్యాంశాలు

  • గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉందని, సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ అన్నారు.
  • మునసబుపేట గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజిమెంట్ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ కే.వి.వి.
  • సత్యన్నారాయణ సభాధ్యక్షతన జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలలో, ముఖ్య అతిధిగా పాల్గొన్న సుడా.చైర్మన్ కొరికాన.రవి కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితం ఒక అంతులేని ప్రయానమని, ఈ ప్రయానంలో ఎన్నో మైలు రాళ్ళు దాటి, సత్ప్రవర్తనతో తోటి విద్యార్థుల పట్ల స్నేహ భావంతో, సోదర బావంతో ఉంటూ,…

గురజాడ విద్య సంస్థలతో, నాకు విడదీయరాని బంధం ఉందని, సుడా చైర్మన్ కొరికాన.రవి కుమార్ అన్నారు. మునసబుపేట గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజిమెంట్ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ కే.వి.వి. సత్యన్నారాయణ సభాధ్యక్షతన జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలలో, ముఖ్య అతిధిగా పాల్గొన్న సుడా.చైర్మన్ కొరికాన.రవి కుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితం ఒక అంతులేని ప్రయానమని, ఈ ప్రయానంలో ఎన్నో మైలు రాళ్ళు దాటి, సత్ప్రవర్తనతో తోటి విద్యార్థుల పట్ల స్నేహ భావంతో, సోదర బావంతో ఉంటూ, కళాశాల నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో, ఉన్నతమయిన విద్యాబుద్దులు నేర్చుకోని జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. కొత్త విద్యార్థులకు సహాయపడటం, వారిని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా సీనియర్ విద్యార్థులు మెలగాలని, ఫ్రెషర్స్ డే నిర్వహించడం వల్ల కొత్త విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వారి ప్రతిభను, సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒక వేదిక లభిస్తుందన్నారు. కళాశాల డైరెక్టర్ జి.సంయుక్త, విశిష్ట అతిధి జివి.స్వామి నాయుడు, కరస్పాండెంట్ అంబటి.రాంబాబు విద్యార్థులనుద్దేసించి ప్రసంగించిన అనంతరం విద్యార్థులు చేసిన నృత్యాలు, పాటలు, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, డిగ్రీ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *