Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్న కాంగ్రెస్ నేత మహమ్మద్ జీషాన్ అలీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

నిర్మల్ (పున్నమి ప్రతినిధి)
నిర్మల్‌కు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ జీషాన్ అలీ డాక్టరేట్ పట్టా అందుకోవడం పట్ల పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు విద్యావసరాల కోసం ఆర్థిక సహాయం అందించడం, తన పాఠశాలలో ఉచిత ప్రవేశాలు కల్పించడం, పదో తరగతి విద్యార్థులకు ఉచిత కోచింగ్ నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ వారు పాండిచేరిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మహమ్మద్ జీషాన్ అలీ మాట్లాడుతూ, తనకు లభించిన డాక్టరేట్ గౌరవం సామాజిక సేవతో పాటు రాజకీయ రంగంలోనూ మరింత ప్రజాసేవ చేయడానికి ఉత్సాహాన్ని, బాధ్యతను పెంచిందన్నారు. ప్రజలకు మరింత చేరువై సేవా కార్యక్రమాలను విస్తరిస్తానని ఆయన తెలిపారు.

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్న కాంగ్రెస్ నేత మహమ్మద్ జీషాన్ అలీ

సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ అందుకున్న కాంగ్రెస్ నేత మహమ్మద్ జీషాన్ అలీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *