ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం మంగళవారం ప్రారంభం కానుండగా, కూల్చివేతల కారణంగా నివాసాలు కోల్పోయిన వారికీ ఓటు హక్కు అందేలా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి అశోక్ కుమార్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి నమోదిత చిరునామాను సందర్శించి ఫారాలు అందజేసి తిరిగి సేకరిస్తారని చెప్పారు. తాత్కాలిక నివాసాల్లో ఉన్నవారిని కూడా ఓటరు జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 5న ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసి, అభ్యంతరాల పరిశీలన అనంతరం అక్టోబర్ 7న తుది జాబితాను ప్రకటించనున్నారు. ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

కూల్చివేతలతో నిర్వాసితులైన వారికీ ఓటు హక్కు కల్పిస్తాం: ఢిల్లీ ఎన్నికల అధికారి