తమిళనాడులో ప్రతిపక్ష ఏఐఏడీఎంకేకు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన కరూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ సోమవారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌కు ఆయన స్వయంగా రాజీనామా లేఖ అందజేయగా, దానిని స్పీకర్ ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో ఖాళీ స్థానాల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే పలువురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు పార్టీని వీడి రాజీనామా చేయడంతో పార్టీ బలం తగ్గింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించే విషయంలో స్పీకర్ పాత్రపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి కూడా కోర్టులో తన వివరణ సమర్పించారు.

మరో ఎమ్మెల్యే రాజీనామాతో ఏఐఏడీఎంకేకు ఎదురుదెబ్బ