Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ప్రజా సమస్యలపై కూటమి నాయకుల గళం… కార్యదర్శి కీలక హామీలు..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రజా సమస్యలపై కూటమి నాయకుల గళం… కార్యదర్శి కీలక హామీలు..!

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి: (పున్నమి న్యూస్ | రిపోర్టర్ ఆనంద్ ): ఏటికొప్పాక గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, అక్రమ నిర్మాణాలు, అభివృద్ధి పనులు తదితర ప్రజా సమస్యలపై పంచాయతీ కార్యదర్శి కె.
  • గిరిప్రసాద్ మాజీ సర్పంచ్ కాంట్రాకోట చిరంజీవి, అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, కొండయ్య నాయుడుతో పాటు పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ సమావేశమై చర్చించారు.
  • గ్రామంలో పారిశుధ్య కార్మికుల కొరతను నాయకులు ప్రస్తావించగా, అదనంగా ముగ్గురు పారిశుధ్య కార్మికులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు.

యలమంచిలి: (పున్నమి న్యూస్ | రిపోర్టర్ ఆనంద్ ):

ఏటికొప్పాక గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, అక్రమ నిర్మాణాలు, అభివృద్ధి పనులు తదితర ప్రజా సమస్యలపై పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ మాజీ సర్పంచ్ కాంట్రాకోట చిరంజీవి, అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, కొండయ్య నాయుడుతో పాటు పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ సమావేశమై చర్చించారు.
గ్రామంలో పారిశుధ్య కార్మికుల కొరతను నాయకులు ప్రస్తావించగా, అదనంగా ముగ్గురు పారిశుధ్య కార్మికులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. అలాగే కార్మికుల ఆరోగ్య భద్రత కోసం సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లు అందిస్తామని తెలిపారు.
గ్రామ సచివాలయ సిబ్బంది విధి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్యదర్శి సూచించారు. తాగునీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని నిల్వ చేయవద్దని, తడి–పొడి చెత్తను వేరుగా వేయాలని, అలాగే గ్రామంలో అక్రమ నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ప్రజల సహకారం, అధికారుల బాధ్యత, నాయకుల పర్యవేక్షణతో ఏటికొప్పాకను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సమావేశంలో వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *